17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

హింసను అరికట్టాలి!

07-12-2025 12:00 AM

మహిళలపై హింస అనేది పురాతనమైన అత్యంత విస్తృతమైన అన్యాయంలో ఒకటి. అయినప్పటికీ హింస నివారణకు అతి తక్కు వగా చర్యలు తీసుకుంటున్న సమాజం మనది’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. జనాభాలో సగం మంది భయంతో జీవిస్తున్నప్పుడు ఏసమాజం కూడా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండలేదు. ఈ హింసను అరికట్టడం.. మనకు గౌరవం, సమానత్వం, మానవ హక్కులకు సంబంధించిన విషయం.

మహిళలకు, బాలికలకు సాధికారత కల్పించడం సమాజంలో శాంతి, అభివృద్ధి, ఆరోగ్యానికి అవసరం. ’మహిళ లకు సురక్షితమైన ప్రపంచం. అందరికీ మెరుగైన ప్రపంచం’ అని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస విస్తృతంగా వ్యాపించి ఉంది. ఇది అన్ని దేశాలు, ప్రాంతాల్లో మహిళలను ప్రభావితం చేస్తోంది. భారతదేశంలో 15- నుంచి 49 సంవత్సరాల వయస్సుగల మహిళల్లో ఐదోవంతు మంది 2023లో సన్నిహిత భాగస్వామిచే హింసకు గురయ్యారు.

దాదాపు 30 శాతం మంది వారి జీవితకాలంలో ప్రభావితమయ్యారని ఓ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముగ్గురిలో ఒకరు, లేదా 84 కోట్ల మంది వారి జీవిత కాలంలో భాగస్వామి లేదా ఇతరుల నుంచి లైంగిక హింసను ఎదుర్కొన్నారు. సమాజంలో అర్థవంతమైన మార్పులు తేవడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అందుకు ఇతోధికంగా నిధులు కేటాయించాలని నివేదిక ప్రపంచాన్ని కోరుతోంది. మహిళలు, బాలిక లకు సాధికారత కల్పించడం అనేది ఐచ్ఛికం కాదు.

శాంతి, అభివృద్ధి, ఆరోగ్యానికి అది ఒక అవసరం. ఆత్మహత్యలను నివారించాలి. విద్యార్థుల ఆవేదనను వ్యక్తిగత కౌన్సెలింగ్ ద్వారా లేదా హెల్ప్ లైన్ ద్వారా తొలగించడాన్ని విస్తృతం చేయాలి. సామాజిక, ఆర్థిక, విద్యారంగాల్లో పురోగతి సాధిం చాలంటే.. జనాభాలో సగంగా ఉన్న మహిళల పట్ల మానవీయ కోణాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వాలు వివిధ మాధ్యమాలలో ప్రకటనలు, ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. 

 వేణుగోపాల్, జాగిత్యాల