calender_icon.png 12 December, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీఐ యాక్ట్ అమల్లో నిర్లక్ష్యం!

07-12-2025 12:00:00 AM

తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం ఎంత అవసరమో, ఆంధ్రా పాలకుల దోపిడీకి గురై అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజల వెనకబాటుతనాన్ని గుర్తించి ప్రజలకు అండగా నిలిచిన మీడియా కృషిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవలేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కి అవినీతి, అక్రమాలే లక్ష్యంగా కొనసాగిన గత బీఆర్‌ఎఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో మరో పదేళ్లు వెనక్కి వెళ్లిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రజలకు మంచి పాలనను అందించేందుకు, అధికారుల్లో జవాబుదారీతసం కొనసాగేందుకు ఏర్పాటు చేసిన అనేక చట్టాలు ఆచరణలో, అమలులో చతికిలపడుతున్నాయి. ఇదే కోవలో సమాచార హక్కు చట్టం 2005 కూడా చేరిపో యింది. ఏ సమాచారమైనా ఆర్టీఐ ద్వారా అర్జీ పెట్టుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వాలు పేర్కొన్న మాటలు మూటలకే పరిమిత మవుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఆర్టీఐ కేంద్రాల్లో పెండింగ్ ఆర్జీలు కుప్పలుగా పేరుకుపోయాయి. అందుకే సమాచార హక్కు చట్టం పరిస్థితిపై మీడియా ఫోకస్ చేయాలి. ఆర్టీఐ యాక్ట్ అమల్లో అధికారుల నిర్లక్ష్యం పై ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాల్సిన అవసరముంది. 

 పవన్ సాయి, ఖమ్మం