calender_icon.png 22 July, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విశ్వబ్రాహ్మణులు

21-07-2025 12:00:00 AM

మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, జూలై 20 (విజయ క్రాంతి): తెలంగాణ మలి దశ ఉద్యమంలో విశ్వబ్రాహ్మణులు కీలక భూమిక పోషించారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం నగరంలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్ లో విశ్వబ్రాహ్మణుల సహస్ర చంద్ర దర్శకుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుకూ మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి, ప్రొఫెసర్ జయశంకర్ పోరాట పటిమ, త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామన్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి తెలంగాణ అభివృద్ధిలో కీలక భూమిక పోషించారని అన్నారు. విశ్వబ్రాహ్మణులు ఎంతో వృత్తి నైపుణ్యంగలవారిని అన్నారు. విశ్వబ్రాహ్మణులతోపాటు వివిధ కులవృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, విశ్వబ్రాహ్మణులు, బీఆర్‌ఎస్ నాయకులు, తదితరులుపాల్గొన్నారు.