21-07-2025 12:00:00 AM
తుర్కయంజాల్, జులై 20:తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఏవీ నగర్ ఫేజ్-1 డెవలప్మెంట్ అసోసియేషన్ ఏకగ్రీవం గా ఎన్నికైంది. నూతన అధ్యక్షుడిగా కె.శివగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎ.రవీందర్ బా బు, జనరల్ సెక్రటరీగా వి. విద్యాసాగర్ ఎ న్నియ్యారు. వీరితో పాటు ఉపాధ్యక్షులుగా శంకర్ నాయక్, వెంకటేశ్, జాయింట్ సెక్రటరీలుగా బ్రహ్మచారి, కె.రవినాయక్ ను ఎ న్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ కాలనీలో సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మౌలిక సదుపాయల కల్పనకోసం అధికారులను, పాలకులను కలిసి విన్నవిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీలు జగదీశ్, నిర్మల్, స్వామినాయక్, అం జిగౌడ్, ట్రెజరర్ శ్రీనివాసరెడ్డి, లీగల్ అడ్వయిజర్ యాదవరెడ్డి, సలహాదారులు శాంత మూర్తి, జంగారెడ్డి, మహేందర్, శశాంక్, జొన్నాడ మధురెడ్డి, నీలాచారి, మోహన్, సత్యనారాయణ, పలువురు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు.