calender_icon.png 22 July, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

21-07-2025 12:00:00 AM

 - గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

-  ఎన్టీఆర్ నగర్ లోని ఖిని మైసమ్మ అమ్మవారికి 

- పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క 

ఎల్బీనగర్, జులై 20 : తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మైసమ్మ అమ్మవారిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరుకున్నారు. ఎల్బీనగర్ లోని మహల్ మైసమ్మ ఆలయంలో ఆదివారం తొలి బోనం సమర్పణ, పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ఫౌండర్ చైర్మన్ గుంటి లక్ష్మణ్, కార్యనిర్వహణాధికారి (ఈవో) ప్రేమ్ కుమార్ రావు పర్యవేక్షణలో వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 300 సంవత్సరాల క్రితం వెలసిన ఖిలసిన మైసమ్మ కు ప ట్టు వస్త్రాలు సమర్పించడానికి అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఆలయం, ఎన్నో మహిమలున్న మైసమ్మ బోనాలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని తెలిపారు.

ఖిలిపారు మైసమ్మ తల్లి దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కో రుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీ పీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి,  యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, పున్న గణేష్ నేత, గడ్డి మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేంద్ర కుమార్(సురేష్), అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, శంకర్ యాదవ్, సామిడి గోపాల్ రెడ్డి, గట్ల రవీందర్, తలాటి రమేష్ నేత, జగన్, జ్ఞానేశ్వర్, శేఖర్ ముదిరాజ్, సుభాన్ యాదవ్, శ్రీధర్, పుట్టగల్ల జంగారెడ్డి , శ్రీశైలం సందీప్, నబి, సంతోష్, విప్లవ రెడ్డి, లక్ష్మి, రేణుక, మాధవి, అరుణ సుజాత తదితరులు పాల్గొన్నారు.

- బోనమెత్తిన మంత్రి సీతక్క

వనస్థలిపురం ప్రశాంత్ నగర్ కాలనీలోని కనకదుర్గ దేవాలయంలో అదివారం నిర్వహించిన కొండ పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ఆహ్వానం మేరకు మంత్రి సీతక్క బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. కొండ పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు.

అనంతరం చైర్మన్ చిలుక మధు సూదన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు మంత్రి హాజరై వారి కుటుంబసభ్యులతో భోజనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, కార్పొరేటర్ రాగుల వెంక టేశ్వర రెడ్డి, దేవాలయ చైర్మన్ సంరెడ్డి భుజంగరెడ్డి, కమిటీ సభ్యులు పద్మారెడ్డి, వీరేశం, కృష్ణారెడ్డి, యుగంధర్ రెడ్డి బాలాజీ నాథ్, కరుణాకర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.