పేదల సొంతింటి కల సాకారమే కాంగ్రెస్ లక్ష్యం
మొయినాబాద్ ఆగస్టు 23(విజయ క్రాం తి): పేదల సొంతింటి కలను సాకారం చే యడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామెన భీమ్భరత్ అన్నారు. ఆదివారం మొ యినాబాద్ మండలం ఎల్కగూడ గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తికావడం తో నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నూతన గృ హాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భీ మ్భరత్ మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొం తింటి కల నెరవేరుతోందన్నారు. ఇల్లు పూర్తిచేసుకుని గృహప్రవేశం చేయడం సంతో షకరమైన విషయమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న సీఎం రేవంత్రెడ్డికి చేవెళ్ల నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, మాజీ మండల అధ్యక్షుడు మానయ్య, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, బిక్షపతి, INTUC ప్రధాన కార్యదర్శి భానూరి శివశంకర్గౌడ్, మినాజుద్దీన్, విజయ్కుమార్, షమీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






