21-08-2025 01:14:58 AM
-ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రంలో పాలన
-21 ఏళ్లకే చట్టసభలకు అవకాశం కల్పిస్తాం
-రాహుల్‌గాంధీ ప్రధాని కాగానే అసెంబ్లీలో తొలి బిల్లు అదే
-రాజీవ్‌గాంధీ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
-గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్ర: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): పారదర్శక పాలన కోసం ప్రభుత్వంలో సాంకేతికతను జోడించిన దార్శనికుడు మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆశయ సాధనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, తెలంగాణ లో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యా యాన్ని ఏకకాలంలో పరుగులు పెట్టిస్తున్నామని స్పష్టం చేశారు.
బుధవారం రాజీవ్‌గాం ధీ జయంతిని పురస్కరించుకుని సచివాల యం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి సీఎం పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును నిర్దేశించే శక్తి యువత చేతుల్లో పెట్టాలన్న గొప్ప సంకల్పంతోనే రాజీవ్‌గాంధీ ఓటు హక్కు వయ స్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు. రాజీవ్ తనయుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో యువతకు చట్టసభ ల్లో పోటీ చేసే హక్కును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని వెల్లడించారు.
దేశ రాజకీయాల్లో యువత పాత్రను కీలక మలుపు తిప్పే దిశ గా తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేయనుందని సీఎం ప్రకటించారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయిన వెంటనే శాసనస భకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతామని చెప్పారు. రాజీవ్‌స్ఫూర్తితో రాహు ల్‌గాంధీని ప్రధానిగా చేసేంత వరకు కాంగ్రె స్ శ్రేణులు విశ్రమించవు అని రేవంత్‌రెడ్డి అన్నారు. యువతకు అవకాశాలు కల్పించ డం ద్వారానే నవభారత నిర్మాణం సాధ్యమ ని రాజీవ్ కలలు కన్నారని, ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
రాజీవ్ స్ఫూర్తితోనే మూసీ నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని, ప్రపంచం తో పోటీ పడే విధంగా హైదరాబాద్‌లో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మించబోతున్నాం అని ప్రకటించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతూ రాజ్యాధికారం లో అణగారిన వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తున్నామని తెలిపారు. కంప్యూటర్, టెలికాం రంగాల్లో రాజీవ్ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల పుణ్యమే నేడు యువత ప్రపం చ వేదికలపై సత్తా చాటుతోందన్నారు. రాజీ వ్ హయాంలో హైటెక్ సిటీకి పడిన పునాదే.. నేడు హైదరాబాద్ నగరాన్ని ఐటీ, డేటా సెంటర్ల హబ్‌గా నిలబెట్టింది అని సీఎం వివరించారు.
సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్‌గాంధీ: మహేశ్‌కుమార్‌గౌడ్
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్‌గాంధీ అని అన్నారు. దేశం లో ఒకవైపు త్యాగాల గాంధీ కుటుంబం ఉం టే, మరోవైపు పదవుల కోసం ఎంతకైనా దిగజారే మోదీ, అమిత్ షా ఉన్నారని మండి పడ్డారు. గాంధీ కుటుంబంపై బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను, కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొ న్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.