21-08-2025 01:17:12 AM
-ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కంచె ఐలయ్యను పెట్టొచ్చుగదా!
-రేవంత్‌రెడ్డి మద్దతిచ్చిన వ్యక్తిని మేం వ్యతిరేకిస్తం
-ఎన్నికల తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తం
-బీసీని అభ్యర్థిగా కాంగ్రెస్ ఎందుకు ప్రకటించలే?
-ఏ కూటమి మమ్మల్ని సంప్రదించలేదు
-రేవంత్ అసమర్థతోనే ఎరువుల కొరత
-కేసీఆర్ పాలనలో ఎన్నడూ కొరత లేదు
-మీడియా సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాం తి): తెలంగాణ రైతులకు కావాల్సిన రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇచ్చిన పార్టీ(కాంగ్రెస్, బీజేపీ) అభ్యర్థికే ఉప రాష్ర్టపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక లకు సంబంధించి ఇంతవరకు తమను ఏ కూటమీ సంప్రదించలేదన్నారు. అయితే తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగానే తాము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
తాము ఎన్‌డీఏ కూటమిలో కాని, ఇండియా కూటమిలోయ కాని లేమన్నారు. తమకు ఢిల్లీలో రాహుల్ గాంధీ, మోడీ తరహాలో ఎవరూ బాస్ లేరని, స్వతంత్రులమన్నారు. బీసీల మీద ప్రేమ నటించే కాంగ్రెస్ పార్టీ, ఉప రాష్ర్టపతి అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని, కంచె ఐలయ్య లాంటి మేధావుల ను పెట్టొచ్చుకదా! అని నిలదీశారు. రాష్ర్టం లో నెలకొన్న ఎరువుల కొరతపై హైదరాబాద్‌లోని నందీనగర్ నివాసంలో కేటీఆర్ బుధ వారం మీడియాతో మాట్లాడారు.
యూరియాను అక్రమ పద్ధతుల్లో తరలించి కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులే బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని అనుమానాలున్నాయన్నారు. ప్రైవేటు కంపెనీలకు లబ్ధి కలిగించి వారి దగ్గర నుంచి ముడుపులు తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వంఏమైనా ఉందా?, కృత్రిమ కొరత సృష్టించి ఎరువులను అధిక ధరలకు అమ్మి కాంగ్రెస్ నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.
రాష్ర్టంలో యూరియా కొరత
సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత, అనుభవలేమి, ప్రణాళిక రాహిత్యంతోనే రాష్ర్టంలో యూరియా కొరత తీవ్రమైందని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఎరువుల కొరత రాలేదన్నారు. సీజన్‌కు ఆరు నెలల ముందే ఎరువులను తీసుకొచ్చేవారని చెప్పా రు. ఎరువులను కొందరు కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 70 లక్ష ల మంది రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే కాంగ్రెస్, బీజేపీలు ఎలక్షన్లు, కలె క్షన్లు అని నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఎంత యూరియా అవసరం, ఎంత వచ్చింది...ఇంకెంత అవసరమో శ్వేతపత్రం విడుదల చేయాలని, లేకుంటే పోరాట కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఎనిమిది మంది కాంగ్రెస్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు పైసా ప్రయోజనం కలగడంలేదని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరుతో నానా హంగామా చేసిన రాహుల్‌గాంధీ తెలంగాణ రైతుల యూరియా సమస్యపై పార్లమెంట్‌లో ఎం దుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు.
పల్లెల్లో క్యూలైన్లు
గత రెండు నెలలుగా ఏ పల్లె చూసినా ఎరువుల బస్తాల కోసం అధికారుల కాళ్ల మీద రైతులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సన్నద్ధత, ఎరువుల మీద ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించలేదని విమర్శించా రు. ఎరువుల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వానికి రాష్ర్ట ప్రభుత్వం ఇంటెండ్ పంపలేదని, దాని ఫలితంగానే ఇవాళ రాష్ర్టంలో ఎరువుల కొర త ఏర్పడిందన్నారు. వ్యవసాయ, మార్కెటిం గ్, రవాణాశాఖ, జిల్లా యంత్రాంగం మధ్య తీవ్రమైన సమన్వయ లోపం ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ మాత్రం అసలు ఎరు వుల కొరతే లేదని, ఇదంతా కృత్రిమ కొరత, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ర్పచారమని జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తున్నారని మం డిపడ్డారు. దమ్ముంటే సీఎం గాని, మంత్రులు గాని గ్రామాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడాలని సవాల్ విసిరారు.
యూరియా తెచ్చిన రైతుపై నాన్ బెయిలబుల్ కేసు
గ్రామాల్లో యూరియా కోసం అల్లాడుతున్న రైతన్నలకు అండగా బీఆర్‌ఎస్ నేతలు కార్యకర్తలు ఉండాలని, అధికారులను నిలదీయాలని కేటీఆర్ సూచించారు. పరకాల నియోజకవర్గం నల్లబెల్లిలో తన కుటుంబసభ్యుల ఆధార్ కార్డుతో మూడు బస్తాల యూరియా తెచ్చిన రైతుపై రేవంత్ ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అరెస్టు చేసిందని, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉందా అని ప్రశ్నించారు.
రైతులు అరిగోస పడుతుంటే రేవంత్‌రెడ్డి ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారు తెలియడం లేదన్నారు. రాష్ర్టంలో ఎరువుల కొరత లేదని సీఎం చెప్తుంటే అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు మాత్రం కేంద్ర ప్రభుత్వం సరిపోయేంత ఎరువులు ఇవ్వలేదని ఆందోళన చేస్తున్నారని, అంటే సీఎం చెబుతున్నది అబద్ధమా? కాంగ్రెస్ ఎంపీలు ఆడుతున్నది డ్రామానా? ఏదో ఒకటి స్పష్టం చేయాలన్నారు. 51సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ముఖం చూసైనా 51 బస్తాల యూరియాను మోడీ ప్రభుత్వం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇవాళ రాష్ర్టంలో పుట్టినరోజు బహుమతిగా ఎరువుల బస్తాలను ఇచ్చే దుస్థితి వచ్చిందంటే రాష్ర్ట ప్రభుత్వానికి ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నింట ప్రభుత్వం ఫెయిల్
ఈ ప్రభుత్వం రుణమాఫీ, రైతుబంధు, ఉచిత విద్యుత్, సాగునీరు అందించడంలో, రైతు బీమా ప్రీమియంను చెల్లిం చడంలో, పంట కొనుగోలులో, బోనస్ ఇవ్వడంలో, విత్తనాలు, ఎరువుల సరఫరాలో కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే 600 మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారని, ఆత్మహత్యల నివారణలో కూడా రేవంత్ ప్రభు త్వం ఫెయిల్ అయిందన్నారు.
ఇంత జరుగుతుంటే ఒక్క బీజేపీ ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే, నాయకు డు... రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడగడం లేదన్నారు. పక్కనే ఉన్న ఏపీ మం త్రులు ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను బతిమిలాడుకొని వాళ్ల రాష్ట్రానికి ఎరువులను తెచ్చుకున్నారన్నారు. రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఫుల్ కెపాసిటీతో ఎందు కు పనిచేయడం లేదు? వెంటనే ఈ విషయంలో కేంద్రం స్పందించి రామగుండం ఫెర్టిలైజర్ యూ నిట్లు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరా రు. హైదరాబాదులో వ్యవసాయ శాఖ కార్యదర్శి, మంత్రిని కలిసి ఎరువుల కొరత పై తాము చర్చిస్తామన్నారు. రైతులు ఎవ రూ ధైర్యం కోల్పోవద్దని, బీఆర్‌ఎస్ అండ గా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ఆ మాటల వెనక మర్మమేంటి?
రాష్ట్రానికి యూరియా ఇచ్చిన పార్టీ అభ్యర్థికే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఇస్తుందని కేటీఆర్ ప్రకటించడం వెనక ఉన్న మర్మం ఉందని రాజకీ య విశ్లేషకులు భావిస్తున్నారు. యూరియాను సరఫరాను చేసేది కేంద్రమే కాబట్టి పరోక్షంగా ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు తాము మద్దతు ఇస్తామని కేటీఆర్ సంకేతాలు ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు అవసరమైన యూరియాను విదేశాల నుంచి లేదా దేశంలోని కంపెనీల నుంచి తెప్పించి రాష్ట్రాలకు పంపే బాధ్యత కేం ద్రానిదే. రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా యూరియాను రైతులకు అందించడం లో మాత్రమే సహాయపడుతాయి. కానీ సొంతంగా యూరియాను ఉత్పత్తి చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో యూరి యా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమే యం లేకపోయినా యూరియా సరఫరా చేసేవారికే తమ మద్దతు ఉంటుందని కేటీఆర్ ప్రకటించడం వెనక అనేక అం శాలు ప్రభావితం చేస్తాయని భావిస్తున్నా రు.
ఇండియా కూటమి అభ్యర్థిగా తెలు గు వ్యక్తి అయిన సుదర్శన్ రెడ్డిని ప్రకటించడంలో సీఎం రేవంత్‌రెడ్డి పాత్ర ఉన్నద ని కేటీఆర్ నమ్ముతున్నారు. ఈ క్రమం లో రేవంత్ మద్దతిచ్చే వ్యక్తికి తాము మ ద్దతు ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పా రు. అంతేకాక బీసీలకు 42 రిజర్వేషన్లు అంటూ రేవంత్‌రెడ్డి సర్కారు బిల్లు తీసుకొచ్చింది.మరి అలాంటపుడు ఇండీ కూ టమి బీసీలకు మద్దతుగా బీసీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించ లే దని కేటీఆర్ ప్రశ్నించారు. అంటే రెడ్డి సా మాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వబోమని పరోక్షంగా కేటీఆర్ చెప్పినట్టేనని పలువురు భావిస్తున్నారు.