08-10-2025 08:17:50 PM
తరిగొప్పుల (విజయక్రాంతి): మండలంలోని జాల్బాయ్ తండా గ్రామానికి చెందిన సభావాత్ భీమ గొర్రెల మందలపై వీధికుక్కలు బుధవారం ఉదయం దాడిచేసి 12 గొర్రెలను చంపేశాయి. వీధికుక్కలు గొర్రెలతో పాటు వాటిపిల్లలపై దాడిచేసి చంపేశాయి. దీంతో దాదాపు రూ.లక్షన్నర నష్టం వాటిల్లిందని గొర్రె కాపారులు సభావత బీమా ఆరోపించారు. ఎంతో కష్టపడి పెంచుకుంటున్న గొర్రెలు, కుక్కల దాడిలో మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. వీధి కుక్కలను సంబంధిత అధికారులు పట్టించుకోవాలని కోరారు. పరిహారం అందేలా అధికారులు చొరవచూపాలని కోరారు.