10-05-2025 01:45:39 AM
బాన్సువాడ, మే 9 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరిం చారు. బాన్స్వాల్లో డిఎస్పీగా పని చేసిన సత్యనారాయణ హైదరాబాదుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో వాయిస్ ప్రిన్సిపాల్ గా పనిచేసిన విట్టల్ రెడ్డి బదిలీపై బాన్సువాడ డిఎస్పీగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తామ న్నారు. పోలీసులకు ప్రజలు సహకరించా లని ఆయన కోరారు.