calender_icon.png 10 May, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

10-05-2025 01:45:07 AM

-వడ్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపిన రైతులు 

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మే9:    నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని,అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం  మార్కెట్ వద్దగల ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం అన్నదాతలు ధర్నా నిర్వహించి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పోలెబోయిన కిరణ్ మాట్లాడుతూ ఐకేపీ సెంటర్లు ప్రారంభమై 45రోజులు గడుస్తున్నా నేటికీ ధాన్యం కొనుగోలు వేగవంతంగాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఐకెపి కేంద్రాలలో లోడయిన లారీలను మిల్లర్లు 5నుంచి7 క్వింటాళ్ల వరకు తరుగు పేరుతో కట్ చేయడం దారుణం అన్నారు.

వెంటనే అధికారులు మిల్లర్లపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేసి కాంటాలు  జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్,బీజేపీ నాయకులు పొన్న హరిప్రసాద్,కూర శంకర్, రైతులు మామిడి రాజ్ కుమార్, లింగస్వామి, పోలెబోయిన పెద్ద లింగయ్య, వడకాల యన్న,యాకస్వామి,అర్వయ్య తదితరులు పాల్గొన్నారు.