10-05-2025 01:45:42 AM
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాం టి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండి, సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులను రద్దుచేసి వారి హెడ్‌క్వార్టర్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వార్తా ప్రచారాల్లో జాగ్రత్తలు తీసుకునేందుకోసం మీడియా అధిపతులతో సమావేశం నిర్వహించాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
24 గంటల ముందే ప్రజలను అప్రమత్తం చేసి, మాక్‌డ్రిల్ నిర్వ హించాలని సూచించారు. సున్నితమైన అంశాల గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం కాకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన గురువారం సచివాలయంలో హై లెవెల్ కమిటీ సమా వేశం జరిగింది. మంత్రులు జూప ల్లి, పొన్నంతోపాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎంవో స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్, డీజీపీ జితేందర్, డీజీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సం దర్భంగా భట్టి విక్రమార్క పులు సూచనలు చేశారు. ప్రజల్లో జాతీయభావాన్ని పెంపొందించేందుకు అన్ని జిల్లా కేంద్రా ల్లో సంఘీభావ ర్యాలు నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు. హైదరా బాదు లో సైరన్ అలర్ట్ ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సీఎస్ రామకృష్ణారావు మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ర్టంలో సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ నిర్వహించినట్టు చెప్పారు.
దేశరక్ష ణలో కీలకపాత్ర వహిస్తున్న రక్షణశాఖకు సం బంధించిన పరికరాల తయారీకి చెందిన పరిశ్రమల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని, మాక్‌డ్రిల్‌లో వీళ్లందర్నీ భాగస్వాములు చేశామని సీఎస్ వివరించారు. ఆస్పత్రి భవనాల స్లాబులపైన ఎరుపు రంగుతో ప్లస్ గుర్తును ఏర్పాటు చేసుకోవాలని అన్ని దవాఖానలకు నోటీసులిచ్చినట్టు చెప్పా రు. డీజీపీ జితేందర్ మాట్లాడు తూ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద మూ డంచెల భద్రతను ఏ ర్పాటు చేశామని, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద భద్రత పెంచినట్టు చెప్పారు.
హైదరాబాద్‌లో ఉన్న డీఆర్డీఏ, డీఆర్‌డీవో, ఎన్‌ఎఫ్ సీ తదితర జాతీయ స్థాయి పరిశ్రమల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్త లు ప్రచారం కాకుండా సైబర్ టీమ్‌లను ఏర్పాటు చేశామని, తప్పుడు వార్త లను కట్టడి చేయడంతో పాటు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు డీజీపీ వివరించారు.
కేవైసీ లేకుండా సిమ్ కార్డు లు జారీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, సున్నితమైన ప్రాం తాల్లో భద్రతను పెంచామన్నారు. రాష్ట్రం లో ఉత్పన్నమయ్యే అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు ముం దస్తుగా చేసుకున్నట్టు చెప్పారు.