వర్షాలు కురవాలని బొడ్రాయికి జలాభిషేకం
చిట్యాల, జూలై 23: మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామంలోని బొడ్రాయికి ప్రత్యేక జలాభిషేక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ, రైతులకు అనుకూలంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు సస్యశ్యామలంగా పండాలని గ్రామ దేవతను ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు కురు యాదయ్య, తెలుసూరి నరసింహ, సాగర్ల నాగరాజు, ఏర్పుల మల్లేశ్వరి, వెంకన్న, జిల్లాల ప్రశాంత్, మర్రి హరీష్ రెడ్డి, ఆనగంటి నరేష్, నీలకంఠం లింగస్వామి, ఏర్పుల నరసింహ, ఆవుల రాము, చేకూరి గణేష్, గంటల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






