25-07-2025 02:16:44 AM
ముషీరాబాద్, జూలై 24(విజయక్రాంతి): ఈ నెల 28, 29 తేదీలలో రైలు నిలయం వెనకాల ఉన్న ఆర్‌ఆర్ సి గ్రౌండ్స్ లో వాలీబాల్, అథ్లెటిక్స్ భాగాలలో జోనల్ స్థాయి టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ జి. మధుసూదన్ తెలిపారు.
ఈ మేరకు గురువారం హైదరాబాద్ గాంధీనగర్‌లోని ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ జి. మధుసూధన్ మాట్లాడుతూ 28, 29 తేదీల్లో సికింద్రాబాద్ రైల్ నిలయం వెనుక ఉన్న ఆర్‌ఆర్‌సి గ్రౌండ్స్‌లో వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాలలో జోనల్ స్థాయి టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ డివిజన్లలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హాజరవుతారని తెలిపారు. తెలంగాణ, ఏపి, కర్ణాటక రాష్ట్రాల లోని సౌత్ సెంట్రల్ జోన్ నుండి దాదాపు 85 మంది పాల్గొంటారన్నారు.