calender_icon.png 30 July, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108లో ప్రసవం..

29-07-2025 06:09:14 PM

తల్లి బిడ్డ క్షేమం 

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కొత్తగూడ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం 108 అంబులెన్స్ లో పురిటి నొప్పులు అధికం కావడంతో గర్భిణీ స్త్రీకి సిబ్బంది కాన్పు నిర్వహించారు. 108 సిబ్బంది సమయస్ఫూర్తి వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గంగారం మండలం కోమాట్లగూడెం గ్రామానికి చెందిన గర్భిణీ దుర్గారపు శ్రీవాణి పురిటి నొప్పులు రావడంతో 108కి శ్రీవాణి భర్త దుర్గారపు అనిల్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. 108 సిబ్బంది ఈఏంటి కవిత, పైలట్ ఫకృద్దీన్ పురిటి నొప్పులతో బాధపడుతున్న శ్రీవాణిని 108 లో కొత్తగూడ కు తీసుకువస్తున్న క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ వరకు రాగానే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది దుర్గారపు శ్రీవాణి కి నార్మల్ డెలివరి చేశారు, శ్రీవాణికి మగ బిడ్డ  జన్మించాడు, పుట్టిన బాబు 2 కేజీల 4 వందల గ్రాములు ఉన్నాడని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఈఏంటి కవిత తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి బిడ్డను కాపాడిన108 సిబ్బంది కి శ్రీ వాణి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.