25-07-2025 02:16:08 AM
కేసీఆర్ కిట్ల పంపిణీ
కోనరావుపేట జులై 24 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కోనరావుపేట బస్టాండ్ ఆవరణంలో కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నామని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధిని కాంక్షించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు.
అందులో భాగంగానే బాలింత ఆడ బిడ్డకు జన్మనిస్తే 13 వేల రూపాయలు మగ బిడ్డకు జన్మనిస్తే 12 వేల రూపాయలు వాటితో పాటు పేద ప్రజల పిల్లల ఆరోగ్య సంరక్షణకై వారిని పెంచి పోషించడానికి మౌలిక వసతులకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా గొప్ప ఆలోచనతో కేసీఆర్ బాలింత పిల్లలకు కేసీఆర్ కిట్టు అందజేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరాలను మరిచి కెసిఆర్ కు పేరు వస్తుందని కేసీఆర్ కిట్టు పంపిణీ ఆపివేశారని అన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా నాయకులు గ్రామ గ్రామాన పేద ప్రజలైన బాలింతల పిల్లలకు కెసిఆర్ కిట్టులను అందించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మల్యాల దేవయ్య, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య యాదవ్, మాజీ ఎంపీపీ చంద్రయ్య గౌడ్, గ్రామ అధ్యక్షులు రాస రత్నాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపు పర్శరాములు,బిఆర్‌ఎస్ నాయకులు రాఘవరెడ్డి, శివతేజ, యాస రాజం,యాస సదానందం,నాగరాజు, బాలింతలు, పార్టీ కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.