calender_icon.png 30 July, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో మిగిలిన సీట్లను లక్కీ డిప్ ద్వారా ఎంపిక

29-07-2025 05:57:44 PM

గద్వాల టౌన్: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో మిగిలిన సీట్లను నిబంధనల మేరకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు(District Additional Collector Narsing Rao) తెలిపారు. మంగళవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో గ్రూప్-3 లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు లేకపోవడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రూప్-1, గ్రూప్-2 నుండి దరఖాస్తు చేసిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో అదనపు జిల్లా కలెక్టర్ నర్సింగ రావు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు.

జిల్లాలో నిర్దేశించిన ప్రైవేట్ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంనకు సంబంధించి మిగిలిన సీట్లకు మొత్తం 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. వీరిలో 1వ తరగతికి ఏడుగురు(నాన్ రెసిడెన్షియల్),5వ తరగతికి పదమూడు మంది (రెసిడెన్షియల్) విద్యార్థులు ఎంపిక చేసినట్లు తెలిపారు.ఎంపికైన విద్యార్థులు తమ దృవపత్రాలను తీసుకొని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.లక్కీ డ్రా ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నుషిత,జిల్లా కో ఆర్డినేటర్ ఆంజనేయులు, కె.జి.బి.వీ కన్వేయర్ హంపయ్య, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.