calender_icon.png 26 December, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

29-07-2025 06:06:12 PM

సర్కిల్ సూపర్డెంట్ ఇంజనీర్ శ్రావణ్ కుమార్..

కామారెడ్డి (విజయక్రాంతి): హెచ్ టి సర్వీస్ లో మంజూరు సింగిల్ విండో వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని కామారెడ్డి సర్కిల్ సూపర్డెంట్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్(Circle Superintendent Engineer Shravan Kumar) తెలిపారు. వినియోగదారుల హెచ్ టి 11 కె.వి, 33 కెవి ఆపై వోల్టేజ్ సర్వీస్ ల మంజూరు వేగవంతం చేయడానికి ఎంతగానో సింగిల్ విండో వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. హెచ్ టి మానిటర్  సెల్ ను సర్కిల్ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 11 కే.వి వోల్టేజ్ దరఖాస్తులను సర్కిల్ ఆఫీస్ ఏడీఈ కమర్షియల్ అధికారి మానిటర్ చేస్తారని తెలిపారు. 33 కెవి ఓల్డ్ ఏజ్ ఆపాయ్ వోల్టేజ్ దరఖాస్తులను ఏడి కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి మానిటర్ చేస్తారని తెలిపారు.

ఈ సింగిల్ విండో కొత్త విధానం వల్ల మొదట వినియోదారులు టి జి ఎన్ పి డి సి ఎల్  పోర్టల్ లో అవసరమైన పత్రాలతో హెచ్ టీ దరఖాస్తులు నమోదు చేసుకున్న తర్వాత కొత్త అప్లికేషన్ నెంబర్ యుఐడి ఉత్పన్నమవుతుందన్నారు. అలా వచ్చిన కొత్త దరఖాస్తులు టి జి ఎన్ పి డి పి ఎల్ యొక్క సంబంధిత సర్కిల్ లలో డాష్ బోర్డులో కనిపిస్తుంది అన్నారు. ప్రతిరోజు ఏడిఈ కమర్షియల్ అధికారులు డాష్ బోర్డు ని మానిటర్ చేస్తూ ఉంటారని తెలిపారు. దరఖాస్తు నమోదు చేసుకున్న తర్వాత 11 కెవి, 33 కే విలపై వోల్టేజ్ దరఖాస్తులు సంబంధిత అధికారులకు ఎస్టిమేట్ల కొరకు పంపబడుతుందన్నారు. ఏ డి ఈ కమర్షియల్ సర్కిల్ ఆఫీస్ ఫీల్డ్ స్టాప్ ఫీజిబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం లొకేషన్ ను సందర్శిస్తారు అన్నారు. 33 కెవి ఆపాయ్ ఓల్టేజ్ ఎస్టిమేట్లను కార్పొరేట్ ఆఫీస్ అధికారులు అనుమతి ఇస్తారని తెలిపారు.

33 కెవి ఆపై ఓల్డ్ దరఖాస్తులు అయితే ఆన్లైన్ లో సంబంధిత కమర్షియల్ ఆర్ ఏ సి టి జి ట్రాన్స్కో హైదరాబాద్ కి ఫీజిబిలిటీ కోసం పంపించబడుతుందన్నారు. 11 కెవి ఓటి దరఖాస్తులు పరిశీలించి పిజిబిలిటీ ఉంటే రెండు రోజుల్లో అప్లోడ్ చేయబడుతుందన్నారు. వివిధ కారణాలవల్ల సాధ్యపడకపోతే రెండు రోజులలో ఆ సూచనలు వినియోదారునికి ఎస్ఎంఎస్ రూపేనా పంపబడుతుందని అన్నారు. 33 కెవి ఆపై ఒంటరి దరఖాస్తులు పరిశీలించి వాటి కావాల్సిన మౌలిక అవస్థలు ఏర్పాటుకు పొందుపరిచిన సమయానుగుణంగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సింగిల్ బిల్డింగ్ వ్యవస్థ వలన సరిత గతిన సర్వీసులు మంజూరు అవుతాయని ప్రతిసారి ఆఫీసులకు రాకుండా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉందని అన్నారు. దీనివల్ల అత్యంత పారదర్శకత పెరుగుతుందన్నారు. వినియోదారులకు దరఖాస్తుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ రూపేనా సమాచారం పంప పడుతుందని ఎస్ ఈ శ్రావణ్ కుమార్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు.