29-07-2025 06:01:47 PM
చిట్యాల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి..
చిట్యాల (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని చిట్యాల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి(Congress Mandal Party President Gotla Tirupati) అన్నారు. మంగళవారం మండలంలోని గుంటూరు పల్లి గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు మోటార్లు ప్రారంభించకపోతే నిరాహార చేస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే ఆత్మ విమర్శ చేసుకోవాలని తిరుపతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచి బీఆర్ఎస్ లో చేరి నియోజవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంత మందికి ఇల్లు మంజూరు చేశారని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, యూత్ మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్, గడ్డం కొమురయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్ధన నాగరాజు, శివరామకృష్ణ, శంకర్, నాగేశ్వరరావు, సతీష్,సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.