16-12-2025 12:00:00 AM
కామారెడ్డి , డిసెంబర్ 15 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ ఆరిఫ్ సోమవారం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగిందని ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వలు లేవని పిలుపునివ్వడంతో మొదటిసారి రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.
ప్రభుత్వ వైద్యశాలలో రక్తనిల్వలు లేకపోవడం వలన పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని యువకులు స్పందించి రక్తదానానికి ముందుకు రావాలని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడానికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరూ అర్హులనీ, ఆరోగ్యంగా ఉన్నవారు 65 సంవత్సరాల వరకు రక్తదానం చేయవచ్చని అన్నారు.
రక్తదానం చేసిన రక్తదాతలకు 28 రోజుల్లోనే మళ్లీ తిరిగి ఆ రక్తం మన శరీరంలో పునరుత్పత్తి కావడం జరుగుతుందని ఈ విషయం తెలియక చాలామంది రక్తదానం చేస్తే బలహీన పడతామనే అపోహలో ఉన్నారన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉందని ఎన్నో సర్వేలు తెలియజేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సమధ్, టెక్నీషియన్లు ప్రమోద్,అరుణ్ లు పాల్గొనడం జరిగింది.