16-12-2025 12:00:00 AM
గాంధారి నూతన సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్
గాంధారి డిసెంబర్ 15 (విజయక్రాంతి): గాంధారి గ్రామపంచాయతీ సర్పంచ్ గా రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించినందుకు గాంధారి గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని గాంధారి గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్ అన్నారు. ఈ మేరకు సోమవారం రోజున విజయ క్రాంతి విలేకరితో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధి పై నమ్మకం ఉంచి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పటికీ కూడా గాంధారి గ్రామ ప్రజలు నా వెంబడి ఉండి ఇంతటి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఈ విజయాన్ని గాంధారి గ్రామ ప్రజలకు అంకితం చేస్తున్నానని ఆమె అన్నారు. ఇంతటి భారీ విజయాన్ని అందించడంలో పోరాడిన ప్రతి ఒక్కరికి వారి యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రాబోయే ఐదు సంవత్సరాలలో ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో గాంధారి గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని ఆమె అన్నారు.