ఓటేసిన అడవి బిడ్డలు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ప్రశాంతం
చర్ల, మే 13: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అడవి బిడ్డలు ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు లేకుండా పోలింగ్ సజా వుగా ముగిసింది. ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశాల మేరకు ఏఎస్పీ పరితేజ్ పంకజ్ , ఓఎస్డీ సాయి మనోహర్ అత్యంత సమసాత్మకమై న పోలింగ్ కేంద్రాల్లో గట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల ను పర్యవేక్షించి మారుమూల గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రా ల్లో ఓటింగ్ శాతం అధికంగా జరిగేలా చర్య లు తీసుకొని సఫలీకృతులయ్యారు.
ఉద యం 7 గంటల నుంచే గిరిజనులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారు లు తీరారు. గిరిజనులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అరణ్య మార్గం గుండా సుమారు ఐదారు కిలోమీటర్లు నడిచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకొన్నారు. పోలింగ్ ప్రశాతంగా ముగియడంతో అధికారలు ఊపిరి పీల్చుకొన్నారు.




