30-08-2024 02:00:11 AM
రాజేంద్రనగర్, ఆగస్టు 29: పందెంవాగు నాలాను కొందరు దర్జాగా కబ్జా చేశారు. నాలా పక్కనే కట్టడం నిర్మించి నాలాను మట్టిపోసి పూడ్చివేశాడు. స్థానికుల ఫిర్యాదుతో మణికొండ మున్సిపల్ అధికారులు గురువారం రంగంలోకి దిగి రెండు జేసీబీలతో నాలాలోని మట్టిని బయటకు తోడించారు. నాలాకు కబ్జా చెర విడిపించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.