calender_icon.png 27 October, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాకింగ్‌తో అనారోగ్యాలు దూరం

27-10-2025 12:00:00 AM

 మహబూబాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి):  ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల అనారోగ్యాల భారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని, ఆసుపత్రులకు వెళ్లే అవసరం రాదని వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ కూరాకుల భారతి అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వర్తక సంఘ భవనంలో డిప్యూటీ గవర్నర్ ఇమ్మడి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన 4వ క్యాబినెట్ సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

ముఖ్యంగా యువత మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా చూడాల్సిన భాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం డాక్టర్ బి. వీరన్న (వైద్యులు ), వీరారెడ్డి (వాలిబాల్ కోచ్ ), చింతకుంట్ల కుమారస్వామి (కవి ), మద్దెర్ల రమేష్ (రచయిత ), వెలిశాల కుమారస్వామి (బాస్కెట్ బాల్ కోచ్ ), బాస నాగమణి (క్రీడలు ), డాక్టర్ జ్యోష్ణారెడ్డి (గైనకాలజస్ట్ ), మావూరు మల్లేష్ (గాయకులు ), రాంబాబు (తైక్వాండో), వీరునాయక్ (కరాటే ), జి. అనితరెడ్డి (టీచర్ )లను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్టేడ్ గవర్నర్ డాక్టర్ పుల్లూరు శ్రీనివాస్ గౌడ్, పెండ్లి ఉపేందర్, వివిధ వాకర్స్ అసోసియేషన్ ల భాధ్యులు పాలభిందెల మల్లయ్య, కోలా సత్యనారాయణ, మాలే కాళీనాధ్, డాక్టర్ డోలి సత్యనారాయణ, ఉప్పల శ్రీనివాస్, ముయబోయిన వెంకన్న, నామిరెడ్డి వెంకట్ రెడ్డి, లింగారెడ్డి, పరకాల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.