calender_icon.png 30 January, 2026 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూడో పోటీలకు వరంగల్ క్రీడాకారులు

30-01-2026 12:00:00 AM

ట్రాక్ సూట్ కిట్లు పంపిణీ చేసిన బొమ్మినేని రవీందర్‌రెడ్డి 

వరంగల్, జనవరి 28 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎస్జీఎఫ్‌ఐ అండర్-19 బాల బాలికల జాతీయస్థాయి జూడో పోటీలకు ఎంపికైన వరంగల్ క్రీడాకారులకు చాం బర్ ఆఫ్ కామర్స్ వరంగల్ వారి సౌజన్యంతో ట్రాక్ సూట్ కిట్ల పంపిణీ కార్యక్ర మం బుధవారం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారులను సన్మానించారు.

చాంబర్ ఆ ఫ్ కామర్స్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొ మ్మినేని రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల వరంగల్ ఓసిటీలో నిర్వహించిన కేజీఎఫ్‌ఐ అండర్19 రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలకు ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 3 వరకు న్యూఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. పోటీల సమయంలో ఏవై నా సమస్యలు ఎదురైతే చాంబర్ ఆఫ్ కామ ర్స్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం క్రీడాకారు లకు ట్రాక్‌సూట్ కిట్లు పంపిణీ చేశారు.

అలా గే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభావంతమైన జూడో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న కోచు లు సీహెచ్ రాము, నాగరాజును శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో తెలం గాణ రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు బైరబోయిన కైలాసం యాదవ్, కాటన్ సెక్షన్ అధ్యక్షులు వీరారావు, ఆరట్స్ సెక్షన్ అధ్యక్షుడు లింగారెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి సంపత్, ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్19 కార్యదర్శి శ్రీధర్, తెలంగాణ జూడో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి దుపాకీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.