30-01-2026 12:00:00 AM
హైదారాబాద్, జనవరి 29 : ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అరేనా పోలో చాంపియన్‌షిప్ 2026 పోటీలకు కౌంట్‌డౌన్ మొదలైంది. అజీజ్‌నగర్‌లోని హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ వేదికగా జరగబోయే ఈ చాంపియన్‌షిప్‌కు సంబంధించిన జెర్సీని మైనార్టీ శాఖా మంత్రి, భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఆవిష్కరించారు. అంతర్జా తీయ పోలో పోటీలు హైదరాబాద్‌లో జరగనుండడంపై సంతోషం వ్యక్తం చేసారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హైదరాబాద్ పోలో రైటింగ్ క్లబ్ వ్యవస్థాపకుడు చైతన్య కుమార్, హెచ్‌పీఆర్‌సి ప్రతినిధి అర్సలాన్ ఖాన్‌కు హామీ ఇచ్చారు.
ఫిబ్రవరిలో జరగబోయే పోలో చాంపియన్‌షిప్ పోటీలకు రావాల్సిందగా నిర్వాహకులు అజారుద్దీన్‌ను ఆహ్వానించా రు. దీనికి సానుకూలంగా స్పందించిన అజాహార్ వస్తానని చెప్పారు. యుఎస్‌ఏ, ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్ లాంటి దేశాల టాప్ పోలో క్రీడాకారులు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నెలకొల్పిన హెచ్‌పీఆర్‌సీ ఆ పోటీలకు ఆతిథ్యమివ్వడంపై మంత్రి అజారుద్దీన్ హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.