8 March, 2026 | 3:41 PM

Breaking News

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు   •   ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •  

వార్డు అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం

05-02-2026 03:29 PM

20 వ వార్డు లో జోరుగా బి ఆర్ ఎస్ ప్రచారం 

20 వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె  సునీల్ వాల్మీకి 

వనపర్తి,(విజయక్రాంతి):  వార్డు అభివృద్ధి జరగాలంటే అది బి ఆర్ ఎస్ తోనే సాధ్యమని 20 వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె  సునీల్ వాల్మీకి అన్నారు. గురువారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 20 వ వార్డు లో జోరుగా స్థానిక బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి అభ్యర్థి ప్రచారం ను నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వనపర్తి పట్టణంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ, మరొక పక్క ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని సైతం వివరిస్తున్నామని 20 వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె  సునీల్ వాల్మీకి అన్నారు. కారు గుర్తు కు ఓటు వేసి భారీ మెజారిటీ అందించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ ప్రచార కార్యక్రమం లో స్థానిక నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు