జర్మనీ జోక్యం అవసరమా?
ఒకరి దేశ ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోవడం ఏ దేశానికీ మంచిది కాదు. జర్మనీ అత్యుత్సాహంతో ఉక్రెయిన్‌కు తమ ఆయుధాలు ఇవ్వజూపటంపై రష్యా స్పందించింది. జర్మనీ కనుక ఉక్రెయిన్‌కు అణు సామర్థ్యం అందజేస్తే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, తాము కూడ మా మిత్రపక్ష దేశాలను మావైపు రప్పించు కుంటామని, దీనివల్ల ప్రపంచానికి పెద్ద నష్టం సంభవిస్తుందని రష్యా అభిప్రాయ పడింది. కనుక, పశ్చిమ దేశాలు మౌనంగా ఉండటం మంచిదని తీవ్ర హెచ్చరికలు చేసింది.
ఉక్రెయిన్‌కు జర్మనీ ఎందుకు మద్దతు ఇస్తుందో, ఎందుకు అణు సహాయం చేయాలని అనుకుంటుంద న్నది అర్థం కాని విషయం. ‘చేతనైతే యుద్దానికి ఏదైనా ‘రాజీ ఫార్ములా’ తీసుకురావాలి. కాని సహాయ, సహకారాలు అందిస్తా మనడం మంచిది కాదని’ నిపుణుల అభిప్రాయం. ఒకవేళ జర్మనీ ఆయుధాలు ఉక్రెయిన్ ఉపయోగిస్తే తాము తమ మిత్రదేశాలకు అణ్వాయుధాలు ఇవ్వవలసి ఉంటుందని, అప్పుడు అంతర్జాతీయ శాంతి ప్రమాదంలో పడుతుందనీ రష్యా తెలిపింది.
ఇప్పటికీ దాదాపు 6,000కు పైగా ఉక్రెయిన్ సైనికులు తమ దగ్గర బంధీలుగా ఉన్నారని, మా సైనికులు ఉక్రెయిన్ చెరలో దాదాపు 2,000 మంది ఉన్నారని పుతిన్ చెప్పడం గమనార్హం. మరోపక్క గాజాపై ఇజ్రాయెల్ విచక్షణారహితంగా దాడి చేస్తోంది. ఒక పాఠశాలపై తాజాగా జరిగిన దాడిలో పాఠశాల చిన్నారులు చనిపోవడం అత్యంత విషాదకరం. దాదాపు రెండు సంవత్సరాల నుంచి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఎనిమిది నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు జరుగుతుండడం దురదృష్టకరం. శాంతి కోరే ఐక్యరాజ్యసమితి చర్యలు ఫలించడం లేదు.
ఐరాస ఆవిర్భావం (అక్టోబర్ 24) దినోత్సవం లోగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ కాల్పులు ఆగిపోవాలని కోరుకుం దాం. ఒకవేళ జర్మనీ సాయాన్ని ఉక్రెయిన్ స్వీకరిస్తే అణు ప్రమాదం వస్తుందని, ఇది క్షేమకరం కాదని పుతిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అప్పుడు భారతదేశమైనా ఉక్రెయిన్‌కు నచ్చ జెప్పాలి. మన దేశం సూచించే రాజీ చర్యలకు ఉక్రెయిన్ ఒప్పుకుంటే యుద్ధం ఆగిపోతుంది.
అప్పుడు జర్మనీ కూడ ఎటువంటి అణుసామర్థ్యం ఆ దేశానికి అందించనక్కర్లేదు. ఉక్రెయిన్ నుంచి రష్యా ఆశించే ఓ ప్రకటన భారత్ చేయిస్తుందని తద్వారా యుద్ధం ముగిసి శాంతి నెలకొంటుందని ఆశిద్దాం. ఈ దిశలో భారత్ చేసే శాంతి ప్రయత్నాలు ఫలించాలని కోరుకుం దాం. అదే సమయంలో జర్మనీకూడ తన నిర్ణయాన్ని శాంతి కోసమే ఉపయోగిస్తుందని ఆశిద్దాం.
కనుమ ఎల్లారెడ్డి,
సెల్: 93915 23027.






