23 June, 2026 | 1:05 AM

ప్రజల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

23-06-2026 12:17 AM
  1. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా..
  2. ప్రజావాణిలో 1395 దరఖాస్తులు స్వీకరణ

సికింద్రాబాద్, జూన్ 22 (విజయక్రాం తి): జిల్లాలో  వివిధ సమస్యలపై ప్రజలు అందచేసిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్  సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపుకలెక్టర్లు కదిరవన్ పలని,జితేందర్ రెడ్డి,జిల్లా రెవెన్యూ అధికారినారాయణ, హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి లతో కలిసి  కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ  ప్రజావాణిలో ప్రజలు అందచేసిన  దరఖాస్తులను  అధికారులు శాఖల వారీగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా వాణికి  అన్ని శాఖల అధికారులు సకాలం లో తప్పక హాజరుకావాలని ఆదేశించారు. తదుపరి సి.ఎం ప్రజావాణి అలాగే శాఖల వారీగా ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించి, సీఎం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు,

అలాగే జిల్లా ప్రజావాణి లో ఏమైనా పెండింగ్‌లో  ఉన్నట్లయితే అట్టి ఆర్జీలను నిర్దేశించిన వ్యవధిలోపు  పరిష్కరిం చాలని  సూచించారు. ప్రజావాణిలో మొ త్తం దరఖాస్తులు 1395 అందాయని అందులో  హౌసింగ్ 2 బిహెచ్కె  శాఖ కు సంబంధించి 1171అర్జీలు, పింఛన్లు 179,  రెవిన్యూ శాఖ 16, అలాగే ఇతర శాఖలకు సంబంధించి 29 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఓ డాక్టర్.  సురేందర్, డిడబ్ల్యు ఓ అక్కేశ్వరరావు, డిఎం హెచ్‌వో పుట్ల శ్రీనివాస్,  జిల్లా సంక్షేమ అధికారులు జి. ఆశన్న, కోటాజి,ఇలియాస్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికా రులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.