17 April, 2026 | 8:35 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

నీళ్ల నిపుణడు ఆర్ విద్యాసాగర్‌రావు

30-04-2025 12:03 AM

మాజీ మంత్రులు కేటీఆర్, హారీశ్‌రావు...

హైదరాబాద్ (విజయక్రాంతి): సాగునీటి నిపుణుడు ఆర్ విద్యాసాగర్‌రావు వర్ధంతి సందర్భంగా మంగళవారం మాజీమంత్రులు కేటీఆర్(KTR), హరీశ్‌రావు(BRS MLA Harish Rao) తమ ఎక్స్ ఖాతాల్లో నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షను, జల దోపిడీని ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించిన మేథావి ఆర్ విద్యాసాగర్‌రావు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ జన హృదయాల్లో జలవిజ్ఞాన నిధిగా, నీళ్ల సారుగా మిగిలారన్నారు. నీటి రంగ నిపుణుడు, నీళ్లు నిజాలుతో తెలంగాణను జాగృతం చేసిన మహానీయుడు, సమైక్య పాలకుల జలదోపిడీని చివరి శ్వాసవరకు అడ్డుకున్న వ్యక్తి విద్యాసాగర్‌రావు అని హరీశ్‌రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.