calender_icon.png 2 May, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఉపయోగం: ఎమ్మెల్యే కేపి వివేకానంద్

30-04-2025 12:01:48 AM

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 29(విజయ క్రాంతి):ఆత్మరక్షణకై మార్షల్ ఆరట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ అన్నారు.ఇటీవల సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్ రికారడ్స్ చాలెంజ్ మార్షల్ ఆరట్స్ నాన్ స్టాప్ స్పీడ్ పంచెస్ పోటీలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభతో మెడల్స్ సాధించిన క్రీడాకారులు మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మెడల్స్ సత్కరించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆత్మ రక్షణకు మాత్రమే యుద్ధకళలను ప్రదర్శించినట్లయితే విద్య సంపూర్ణంగా పూర్తి చేయగలమని, అదేవిధంగా గురువుల పట్ల కూడా అంతే వినయంగా ఉండాలన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క మహిళ చిన్నతనం నుండి పిల్లలకు కరాటే శిక్షణ ఇప్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బుడోకాయ్ వ్యవస్థాపకుడు కామేశ్వరరావు కట్టా తేజశ్రీ, దాసరి అక్షయ్, ధీరజ్ రతన్ రెడ్డి, కుశలవ, ఝాన్సీ, ప్రవీణ్ నాయక్, ప్రేమ్ కుమార్, చాలా హరీ రామ్ చంద్ర శేఖర్, అంకుష్, వందన, సోహన్ వీర్, అనీల్, ప్రణీత్ రెడ్డి, కేశిరెడ్డి, వేదాన్ష్, నాగ సాయి, దేవ్ చరణ్, విశాల్, హరినాన్షి, త్రివేద్, దుర్గ, క్రీడాకారులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.