11-10-2025 01:37:23 AM
సంగారెడ్డి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలికంగా బ్రే క్ పండింది. బీసీ రిజర్వేషన్ జీవో 9పై గురువారం హైకోర్టు స్టే విధించిన విషయం తెలి సిందే. దీంతో గురువారం ఉదయం మొద టి విడత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా సాయంత్రం వరకు స్టే రావడంతో ఆ శావహుల్లో నిరాశ నెలకొంది.
అప్పటికే కోర్టు ఏం తీర్పునిస్తుందోనన్న అనుమానం తో నామినేషన్లు వేద్దామా ? వద్దా ? అనే మీ మాంస ఆశావహుల్లో కొట్టుమిట్టాడింది. ఈ దశలోనే హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. అసలు ఎన్నికలు జరుగుతాయో లేదో అన్న అనుమానం నెలకొంది. సంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో జహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్ల పరిధిలో 12 జడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాల కు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చే సింది. ఆ తర్వాత హైకోర్టు స్టే నేపథ్యంలో ఎ న్నికలు నిలిచిపోయాయి.
ఆ తర్వాత ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టు ఆదేశాలకు అ నుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపింది. ఎన్నికలు నిలిపివేస్తామని, కోడ్ తొలగిస్తామని ప్రకటించడంతో ప్రస్తుతం జారీ చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగా ఈ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని స్పష్టమైంది. దీని తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది..హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా..లేనిపక్షంలో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల కు మళ్ళీ షెడ్యూల్ జారీ చేస్తుందా ఇలా వివిధ సందేహాల మధ్య ప్రస్తుత స్థానిక సం స్థల ఎన్నికల నోటిఫికేషన్ నిలిచిపోయింది.
నిరాశలో ఆశావహులు..
చాలా రోజుల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఆయా పార్టీలకు చెందిన ఆశావహు లు ఎన్నికలకు సంసిద్ధమయ్యారు. రిజర్వేషన్ల కారణంగా పోటీ చేయాలనుకున్న కొందరికి చేదును మిగిల్చినప్పటికీ ప్రధాన పార్టీలు మా త్రం అభ్యర్థుల జాబితాను తయారు చేసి అధిష్టానానికి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్టే రావడంతో ఒక్కసారిగా ఆశావహుల్లో నిరాశ నెలకొంది.
ప్రభుత్వం ఎన్నికలను ఏ విధంగా ముందు కు తీసుకెళ్తుందోనని, అసలు ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు ఉన్నాయో లేదోనన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. నోటిఫికేషన్ జా రీ కావడంతో నామినేషన్లు వేయడానికి సర్వం సిద్ధం చేసుకున్న ఆశావహులు స్టే కారణంగా ఒక్కసారిగా నీరుగారిపోయారు.
మద్దతునిచ్చే పార్టీల వైపే బీసీలు..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు మద్దతునిచ్చే పార్టీల వైపే నిలబడతామని బీసీలు స్పష్టం చేస్తున్నారు. కోర్టు స్టే బీసీలను నిరాశకు గురి చేసిందని, ఇందుకు కారణమైన పార్టీలకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. అయితే మరో వైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే బీసీలకు అన్యాయం చేశాయని బీఆర్‌ఎస్ విమర్శల వర్షం కురిపిస్తుం టే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
రాజకీయ డ్రామాతోనే కాంగ్రెస్ బీసీ లను వంచించిందని బీజేపీ విరుచుకుపడుతోంది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా జీవో ఎలా జారీ చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కుట్రలో భాగమని విమర్శి స్తున్నారు. ఏదిఏమైనా బీసీలకు న్యాయం చేసే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని బీసీలు తేల్చిచెబుతున్నారు.