11-10-2025 01:18:41 AM
నిరుపయోగంగా మారిన వైనం!
చల్లా బంగ్లా కేంద్రంగా సంక్షేమ పథకాల పంపిణీ!
అలంపూర్ అక్టోబరు 10:ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వారు ప్రజల మధ్య అందు బాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచు కుని ఎమ్మెల్యేలకు గత ప్రభుత్వం వారి ని యోజకవర్గం పరిధిలో కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలను నిర్మించింది.
అలా రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ నడిగడ్డ ప్రాంతం అలంపూర్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అలంపూర్ చౌరస్తాలో కో ట్లు ఖర్చు చేసి కట్టించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రెండేళ్లు పూర్తి కావొస్తున్న ఆ కార్యాలయానికి ఎమ్మెల్యే విజయుడు రాకపోవడం దింతో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగపోవడంతో క్యాంప్ ఆఫీసు నిరుపయోగంగా మారి కుక్కలకు, విష పురుగుల కు ఆవాసంగా మారింది.
ఆయా పనుల నిమిత్తం ఎమ్మెల్యేను కలిసేందుకు క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన ప్రజలకు ఆఫీసు గేటుకున్న తాళం చూసి చేసేది ఏమి లేక వెను తిరుగుతున్న సందర్భం నెలకోంది. దీంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నా రు.
ఇక దీంతో చేసేదేమీ లేక కర్నూలు పట్టణంలో చల్లా బంగ్లా వద్దకు వెళ్లాల్సిన పరిస్థి తులు తప్పలేదనే చర్చ ప్రజల్లో జరుగుతోం ది. క్యాంపు ఆఫీసుకు వచ్చి సమస్యలను చె ప్పుకోవచ్చని భావించిన ప్రజలు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చల్లా బంగ్లా కేంద్రంగా సంక్షేమ పథకాల పంపిణీ
ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫం డ్, కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ సీఎంఆర్‌ఎఫ్ వంటి పలు సంక్షేమ పథకాలకు దర ఖాస్తులు అందించాలన్న మంజూరైన చెక్కులను తీసుకోవాలన్న లబ్ధిదారులు వ్యయ ప్రయాసాల నడుమ కర్నూల్ వెళ్లి చల్లా బం గ్లాకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఎమ్మెల్యేకు ఏ సమస్యను విన్నవించుకోవాలన్నా కర్నూలు చల్లా కాంపౌండ్ వెళ్లాల్సిందేనని మొర పెడుతున్నారు.
ఒకవేళ అక్కడికి వెళ్లి ప్రజలు సమస్యలు చెప్పుకుంటే అక్కడ ఉన్న నాయకులు ఊరిలో ఉన్న మీ నాయకులకు చెప్తాం మీరు వెళ్లండని పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మాట విని తిరిగి ఊర్లకు వచ్చి నాయకులు కలిస్తే సమస్యలు వినే తీరక కూడా నాయకులకు లేకుండా పోయిందని పలువురు చర్చ జరుగుతుంది. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా నాయకుల మాటల పరిమితమయ్యాయని మండిపడ్డారు.
ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలి
కోట్లు వెచ్చించి నిర్మించిన క్యాంప్ ఆఫీ సు నిరుపయోగంగా మారిం దని ప్రజా అవసరాల కొరకు నిర్మించిన ఆఫీసులో ఉం టూ ఎమ్మెల్యే ఉంటూ కార్యకలాపాలు కొనసాగిస్తే మేలు జరుగుతుంది. దీంతో ప్రజలందరూ ఎమ్మెల్యేను కలిసి సమస్యలు చెప్పుకునే కలిసే వీలు కలుగుతుం ది. ఆడబిడ్డలు ముసలోళ్ళు ఎమ్మెల్యేని కలిసేందుకు కర్నూలు వెళ్లాలంటే ప్రయాణం భారంగా మారుతుంది.
బాబు, పుటాన్ దొడ్డి