03-07-2025 02:07:52 AM
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి, జూలై 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రంలో ఉన్న 25 లక్షల రైతులకు 20వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని,కేవలం9 రోజుల వ్యవధిలోనే 9000 కోట్ల రైతు భరోసానిచ్చి రైతంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
బోయినపల్లి మండల కేంద్రంలో శివాజీ నగర్ హై స్కూల్ నుండి ర్యాలీగా వెళ్లి చౌరస్తా వరకు వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు రైతు భరోసా కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా రైతులు,మహిళలు పార్టీ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాల కు పాలాభిషేకం నిర్వహించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రంలో ఉన్న 25 లక్షల రైతులకు 20వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కొనియాడారు, కేవలం 9 రోజుల వ్యవధిలోనే 9000 కోట్ల రైతు భరోసానిచ్చి రైతంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని అభివర్ణించారు,కేవలం సంవత్సరంనర కాలంలోనే ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా లక్ష కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.
అదేవిధంగా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు 72,000 కోట్లను దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసామని అన్నారు.రైతు బీమా,రైతు భరోస ఇస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎల్లేష్ యాదవ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రవీందర్, ఉమ్మడి జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి,సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్లు జోగినపల్లి వెంకట రామారావు వెసిరెడ్డి దుర్గారెడ్డి, ఏం శివయ్య చైర్మన్‌వినోద్‌రెడ్డి తదితరులున్నారు.