17-05-2025 12:10:18 AM
భద్రాద్రి కొత్తగూడెం, మే 16 (విజయక్రాంతి): పాల్వంచ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు అ న్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగర్ కాలనీ ,నెహ్రూ నగర్, శివనగర్ ,పేట చెరువు, శ్రీనివాస్ కాలనీ, అ య్యప్ప నగర్ ప్రాంతాలలో రూ 1.95 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, సిసి డ్రైన్లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎ మ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ప్రతి బస్తీలో రోడ్లు డ్రైన్ ల నిర్మాణ పనులు పై పూర్తిస్థాయిలో దృష్టి సారించి నిధులు వె చ్చిస్తున్నట్లు తెలిపారు. రహదారులు త్రాగునీరు విద్యుత్ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపించి తీరుతామని ప్రజ లకు హామీ ఇచ్చారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఒక్కొక్కటిగా ప్రతి పనిని పూర్తి చేసి తీరుతామన్నారు.
పాల్వంచ, కొత్తగూడం మున్సిపాలిటీలు కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నామని కార్పొరేషన్ ఏర్పాటుతో నగరాలకు దీటుగా పాల్వంచ మున్సిపాలిటీని అభివృద్ధి పరుస్తామని తెలిపారు. శనివారం పా ల్వంచ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్నారని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ధారా ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ k సుజాత, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా డీ సీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు కనకాల అనంత రాములు, సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్ జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.