calender_icon.png 29 August, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షానికి కూలిన ఇండ్లు

28-08-2025 11:13:41 PM

క్షేత్రస్థాయిలో పరిశీలించిన పంచాయతీ సెక్రెటరీ కృష్ణ

చేగుంట (విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేగుంట మండల(Chegunta Mandal) పరిధిలోని చందాయి పెట్ గ్రామానికి చెందిన పెగూడ ముత్యాలు ఇల్లు భారీ వర్షానికి నేలమట్టమయింది. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ కృష్ణ మాట్లాడుతూ.. ఇండ్లు కూలిపోయిన బాధితులకు పునరావాసం కల్పించేలా కృషి చేస్తున్నామని, ప్రభుత్వం తరఫున కూడా ఇల్లు మంజూరు అయ్యేలా ప్రయత్నిస్తామని తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున పురాతన ఇండ్లలో ఉన్నటువంటి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయన తెలిపారు.