calender_icon.png 29 August, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లంతకుంట సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా రమేష్

28-08-2025 11:11:41 PM

ఇల్లంతకుంట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ గా మండల కేంద్రానికి చెందిన కాసుపాక రమేష్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Kavvampally Satyanarayana)కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని కాంగ్రెస్ పార్టీకి, యువజన కాంగ్రెస్ కు పేరు తీసుకొచ్చేలా పని చేస్తానని రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.