28-08-2025 11:32:03 PM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం: కురుస్తున్న వర్షాలతో ప్రజలను, రైతులకు అప్రమత్తం ఉండాలని, అదేవిధంగా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి(MLA Malreddy Ranga Reddy) అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రజా భవన్ క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గ స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తూ చర్యలు చేపట్టాలన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అధికారులు సెలవులపై వెళ్ళేదన్నారు.ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ అధికారులు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై దృష్టి సారించి వాటిని వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు.
వైద్యులు, సిబ్బంది ఖచ్చితంగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అవసరమైన మెడిసిన్ తెప్చించుకుంటూ మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో చెత్తచెదారం, మురికి నీరు నిలువ కుండా ఎప్పడికప్పుడు పారిశుద్ధ్యంపై ప్రత్యే దృష్టిపెట్టాలన్నారు. విద్యుత్ పంపిణిలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పెద్ద యెత్తున గణేశ నిమజ్జనోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఏలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీగా మున్సిపల్, పోలీస్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళాలన్నారు. భూ భారతిలో వచ్చిన రెవెన్యూ సమస్యల పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, ఏసీపీ కేపీవీ రాజుతోపాటు ఆయా మండలాల ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.