calender_icon.png 29 August, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు: సీఐ వెంకటేశ్వర్లు

28-08-2025 11:41:38 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సబ్ డివిజన్ పరిధిలోని గంజాయి వినియోగదారులకు గురువారం సీఐ వెంకటేశ్వర్లు(CI Venkateswarlu) ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని ముఖ్యంగా గంజాయి వినియోగించుట, అమ్ముట నిషేధమని, ఎవరైనా ఇలాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత మంచి లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం చేరుకునే వరకు అవిశ్రాంతంగా శ్రమించాలని తమ లక్ష్యం చేరుకొని ఉన్నతంగా జీవించాలని తెలిపారు.