28-08-2025 11:45:27 PM
కొట్టుకుపోయిన రోడ్డుకు యుద్దప్రాదిపదికన చేయాలె,,
ప్రయణికులకు అంతరాయం ఉండకూడదు,,
అదికారులను ఆదేశించిన కలెక్టర్ దివాకర్ టి ఎస్
తాడ్వాయి (విజయక్రాంతి): మొండ్యాలతోగును కలెక్టర్ దివాకర్ దివాకర్ టిఎస్(Collector Diwakar Diwakar TS) సందర్సించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోతవర్షాలకు వాగులు, వంకలు తోగులు పొంగిప్రవహిస్తున్నాయి. ఈక్రమంలొ మొండ్యాలతోగు పొంగిప్రవహిస్తు రోడ్డుపై నుంచి వరదపోతుంది. వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది. ఏటూరునాగారం వెల్లుతుండగా మొండ్యాలతోగు వద్దకు రాగానె వాగును చూసివాహనం నిలిపారు. రోడ్డుసగం కొట్టుకు పోయి ప్రమాదకరంగా మారింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. యుద్దప్రాదిపదికన రోడ్డును మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రదానరోడ్డు అయినందున పనులుచేయించాలని సూచించారు, హైవే అధికారులు కూడబెట్టిన ఉండటంతో పనులు చేపిస్తామన్నారు. అంతెకాకుండా మద్యహ్నం వాగు ఉదృతిని తెల్సుకుని, తహశీల్దార్ సురేష్ బాబు, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ట్రైనీ ఎస్సై మధుకర్ తనబలగాలతో మొండ్యాలతోగును సందర్సించారు. ఈ విషయాన్ని పస్రా సి ఐ దృష్టికి తీసుకెల్లారు. కలెక్టర్, ఎస్పికి తెలవడంతొ హుటాహుటిన వరదప్రాంతాలను సందర్సించారు. అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు సురక్షిత గ్రామాలకు తరలించుటకు చర్యలు చేపట్టారు.
మొండ్యాలతోగు రోడ్డును యుద్దప్రాదిపదిక మరమ్మత్తులు చేయాలనికలెక్టర్ దివాకర్ టి ఎస్ ఆదేశించారు. ఎడతెరిపిలేకుండా కురిసిన భారీవర్షాలకు మొండ్యాలతోగు వాగు పొంగిప్రవహించింది. వరదప్రవాహం మూలంగా రోడ్డంతా కొట్టుకు పోయిందన్నారు. గురువారం ఏజెన్సీపర్యటనలొ బాగంగా ఏటూరునాగారం వెల్తున్న క్రమంలొ మొండ్యాలతోగు వద్దవాహనం ఆపివాగు, రోడ్డును పరశీలించారు. అంతకుముందు మద్యహ్నం తాడ్వాయి తహశీల్దార్, ఎస్సై, లు ఆవాగునుసందర్సించి పరశీలించారు. అప్పటికే రోడ్డంతా కొట్టుకుపోయి ప్రమాదకరంగా ఉంది. ఓకవైపునే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈవిషయాన్ని జిల్లాకలెక్టర్ కు పోన్ ద్వారా సమాచారం తెలిపారు. ఈక్రమంలో కలెక్టర్ ఏటూరునాగారం ప్రయణిస్తున్న క్రమంలొ మొండ్యాలతోగు వద్ద ఆగారు. వాగును, కొట్టుకుపోయిన రోడ్డును పరశీలించారు. వెంటనెతాత్కలికంగా రోడ్డు మరమ్మత్తు పనులు చేయించాలని ఆదేశించారు. ఆయన వెంట హైవే అదికారులు తహశీల్దార్, పోలీసులు ఉన్నారు.