28-08-2025 11:26:54 PM
మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని సూరయ్యపల్లిలో లక్ష రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన హై మాస్ లైట్(సెంట్రల్ లైటింగ్) సిస్టమ్ ను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్(Single Window Chairman Kotha Srinivas) ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద సెంట్రల్ లైటింగ్ కావాలని గ్రామ నాయకులు అడిగిన వెంటనే ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంజూరు చేశారని తెలిపారు. సూరయ్యపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో శ్రీధర్ బాబు తీసుకు వెళ్తారని ధీమా వ్యక్తం చేశారు. రైతులు ప్రధానంగా గ్రామంలో పొలాలకు వెళ్లే రహదారులు కొంచెం ఇబ్బందిగా ఉంది అని కూడా గ్రామ నాయకులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దానికి కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచ్ మొదలుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో మన గ్రామాలను మన మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని కోరారు. మంథని నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తోనే సాధ్యమని అన్నారు. గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి తరపున రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ సలహా మండలి సభ్యులు శశిభూషణ్ కాచే, మాజీ సర్పంచ్ మంథని కరుణ కృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల కిరణ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు భీముని వెంకటస్వామి, పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనగాం నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ఆరెల్లి కిరణ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కన్నెబోయిన ఓదెలు, యూత్ కాంగ్రెస్ మంథని టౌన్ అధ్యక్షులు పెంటరి రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు రేపాక శ్రీనివాస్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు జంజర్ల మల్లేష్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రావుల నాగేష్, మాజీ వార్డు సభ్యులు ఎరుకల సురేష్, నాయకులు జంజర్ల రాజు, జంజర్ల గట్టయ్య, కోరబోయిన కృష్ణ, చెరుకుతోట రమేష్, తానికంటి రామక్క, మందల రాజిరెడ్డి, మాజీ ఎంపిటిసి ప్రభాకర్ రెడ్డి, కొండ్ర రాజయ్య గౌడ్, కమ్మగోని శంకర్ గౌడ్, రాఘవరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరెల్లి వరుణ్ గౌడ్, బొద్దుల శ్రీనివాస్, నక్క తిరుపతి, జంజర్ల అమరేందర్, రేపాక రాజు, గ్రామ ప్రజలు రేపాక మల్లయ్య, రౌతు రాజయ్య, రేపాక రాములు, రేపాక శంకర్, బొద్దుల కొమురయ్య, మంథని లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.