28-08-2025 11:57:19 PM
మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి..
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో గత మూడు రోజులు కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా బాన్సువాడ నియోజకవర్గంలోని మంజీరా పరివాహక ప్రాంతాల ప్రజలు తమతంగా ఉండాలని మాజీ డిసిసి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి(Former ICC Chairman Pocharam Bhaskar Reddy) గురువారం సాయంత్రం బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్ మండల పరిధిలోని మంజీరా నది పరివాహక గ్రామం సుంకిని గ్రామాన్ని, బీర్కూర్ మంజీరా బ్రిడ్జిని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు.పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో గ్రామానికి ఆనుకుని పారుతున్న మంజీరా నది ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రెండు రోజులుగా బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే తనకు కానీ స్థానిక నాయకులకు, అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద పెరుగుతున్నందున మంజీరా నదిలో నీటిని విడుదల చేస్తున్నారని మంజీరా నది ఉధృతి మరింత పెరుగనుందని ప్రజలకు తెలిపారు. మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంజీరా నది ఉధృతి తగ్గేవరకు ప్రజలు అటువైపు వెళ్ళొద్దని రైతులు పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలకు పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలని సమస్య ఉన్నవారికి భరోసా కల్పించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.