calender_icon.png 29 August, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారుస్తా

28-08-2025 11:48:02 PM

ఎమ్మెల్సీ మల్లన్న

గుండాల (విజయక్రాంతి): రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) మారుస్తానన్నారు. గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూతురు సక్పాల్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు సుద్దాల, అనంతారం, వెల్మజాల, సీతారాంపురం జిల్లా పరిషత్ పాఠశాలలలో షూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని రాబోయే ఐదు సంవత్సరాలలో ఆలేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లను పూర్తి చేసి అడ్మిషన్ లేదు అనే స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హెడ్మాస్టర్ గంధం చంద్రకళ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.