calender_icon.png 18 May, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీని చాటుకున్న మియాపూర్ డిపో బస్‌కండక్టర్

17-05-2025 12:13:15 AM

- బస్సులో మర్చిపోయిన విలువైన బ్యాగు అందజేత

శేరిలింగంపల్లి, మే 16: మియాపూర్ డిపోలో పనిచేస్తున్న బస్ కండక్టర్ తన నిజాయితీ చాటుకున్నాడు. గురువారం మియా పూర్-2 డిపోకు చెందిన పుష్పక్ ఎయిర్ పోర్ట్ బస్సులో తలారి భావన అనే ప్రయాణికురా లు బ్యాగును మర్చిపోయి బస్సు దిగిపోయింది. ఇది గమనించిన బస్ కండక్టర్  షేక్ ముబీన్ ఆ బ్యాగును డిపోలో భద్రంగా అ ప్పగించాడు.

కాగా ఆ బ్యాగులో ఎనిమిది లక్షల విలువైన బంగారు ఆభరణాలు , వస్తువులు ఉన్నాయి. అయితే సదరు ప్రయాణికు రాలిని గుర్తించి శుక్రవారం ఆమెకు బ్యాగు ను అందజేశారు మియాపూర్ డిపో 2 అధికారులు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ షేక్‌ముబీన్ ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ అపర్ణ కళ్యాణి, డిపో మేనేజర్ వెంకటేశం,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.