జొన్న పంటను తరలించేందుకు చర్యలు చేపడుతున్నాం
27-05-2026 03:20 PM
బోథ్,(విజయక్రాంతి): తమ మార్కెట్ కమిటీ పరిధిలో కొనుగోలు చేసిన జొన్న పంటను తరలించేందుకు తగు ఏర్పాటు చేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో ఉన్న జొన్న పంటను నిలువ ఉంచేందుకు స్థానికంగా స్థలం లేకపోవడంతో మండలంలోని పోచర గ్రామంలో ఉన్న గోదామును పరిశీలించడం జరిగిందన్నారు. అందులో 35 వేల క్వింటాళ్ల వరకు నిలువ ఉంచేందుకు స్థలం ఉందని అయితే స్థానికంగా ఉన్న లారీ యజమానులతో మాట్లాడి నిల్వ ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని రెండు మూడు రోజుల్లో తూకం వేసిన జొన్న పంటను తరలిస్తామన్నారు. ఈ విషయమై జిల్లా అధికారులతో చర్చించామని తెలిపారు.






