27 May, 2026 | 4:36 PM

రైతులపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి

27-05-2026 03:19 PM

ఖానాపూర్ బీఆర్ఎస్ విమర్శ

ఖానాపూర్, (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఖానాపూర్ మార్కెట్ యార్డులో రైతు కల్లాలు తడిసిపోయి రైతు దినస్థితిలో ఉన్నాడని, రైతులపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనపడుతుందని ఖానాపూర్ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం వారు ఖానాపూర్ మార్కెట్ యార్డు సందర్శించి రైతులను ఓదార్చారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ షోయబ్ ,కౌన్సిలర్ తాళ్లపల్లి రాజ గంగన్న మాట్లాడుతూ ఒకవైపు రైతుకు అప్పుల భారం, మరోవైపు పెట్టుబడి ఖర్చు ,రైతులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోగా మాయిచ్చర్ పేరుతో కొనుగోలు తాత్సారం, రవాణాకు సౌకర్యాలు కల్పించకపోవడం రైతు కన్నీటికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రాము నాయక్, గౌరీకర్ రాజు ,పుప్పాల గజేందర్, కారింగుల సుమన్, తదితరులు ఉన్నారు.