16-12-2025 12:00:00 AM
కొత్త సర్పంచ్‌లను అభినందించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాం తి): బీజేపీ రాష్ట్ర నాయకుల సహకారంతో కేంద్రం నుండి ప్రత్యేక నిధులను తెప్పించి జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రెండో విడత పంచాయితీ ఎన్నిక ల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 54 మంది గెలుపొందడంతో సోమవారం వారిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువాలతో సత్కరించి అభినందించారు.
అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి చేపట్టిన విజయోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టపాసులు కాలుస్తూ, ఉత్సా హంగా నృత్యాలు చేశారు. అనంతరం ఎమ్మె ల్యే శంకర్ మాట్లాడుతూ ... గ్రామీణ ప్రాంత ప్రజలు బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించి, పెద్ద ఎత్తున సర్పంచులుగా గెలిపిం చినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పంచాయితీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే జడ్పిటిసి, ఎంపిటిసి, కౌన్సిలర్ ఎన్నికల్లో సైతం ప్రజలందరూ బిజెపి అభ్యర్థులను బలపరచాలని పిలుపునిచ్చారు.
ఓడిన అభ్యర్థులు సైతం ఎలాంటి అధైర్యానికి గురికా వద్దని ప్రజాసేవలో ఉండాలని సూచించారు. గెలుపు కోసం రాత్రింబగళ్ళు కష్టపడ్డ బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యే క కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుంచి గ్రామీ ణ ప్రాంతాల అభివృద్ధికి 3 వేల కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని తెలిపారు. అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, కొన్నిచోట్ల బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఇద్దరు కుమ్మకైనప్పటికీ ప్రజలు బిజెపి బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.