16-12-2025 12:00:00 AM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రం భీం ఆసిఫాబాద్,డిసెంబర్ 15(విజయ క్రాంతి): 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరగనున్న 3వ విడత ఎన్నికల కొరకు ఎన్నికల సామాగ్రి కేటాయించిన ప్రకారంగా సమర్థవంతంగా పంపిణీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ తో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన అధికారులు, సిబ్బంది నిర్దేశిత సమయానికి తమకు కేటాయించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలలో రిపో ర్టు చేయాలని, ఆయా పోలింగ్ కేంద్రాల వారిగా కేటాయించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. 3వ విడతలో భాగంగా ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్ నగర్ మండలాలలో గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానా లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ నెల 17వ తేదీన ఉదయం 7 గం టల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం గ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకమైన ఎన్నికలు జరిగేలా అధికారు లు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.