22 June, 2026 | 1:47 AM

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి

22-06-2026 12:36 AM

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ సీసీ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య

ముషీరాబాద్, జూన్ 21 (విజయక్రాం తి): యువతను పట్టి ఫీడిస్తున్న డ్రగ్స్ మహామ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి పౌరుడు కంకణబద్దుడు కావాలని తెలంగాణ యాం టీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య పిలుపునిచ్చారు. డ్రగ్స్ ఫ్రీ-యంగ్ ఇండియా లక్ష్యంగా  రాష్ట్ర ప్రభుత్వం, ఈగల్ ఫోర్స్ సహకారంతో ఆదివారం  హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియం తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ’శపథ్’ పేరు తో యువతకు  అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. తెలంగాణలో డ్రగ్స్ వినియోగం ఆందోళనకరమైన స్థాయికి చేరుకుందని, ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసి కట్టుగా పోరాడాలన్నారు. 2019లో ఎయి మ్స్, కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం గంజాయి వినియోగంలో తెలంగాణ దేశంలోనే 28వ స్థానంలో ఉందన్నారు. ఓపియాయిడ్స్ రాష్ట్రం 23వ స్థానం, అపస్మారక మందులు19వ స్థానం, కొకైన్ వినియోగంలో తెలంగాణ10వ స్థానంలో ఉందని వెల్లడించారు. గీరిష్ సంఘీ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా అగర్వాల్ సమాజ్ చేపపడుతున్న ఈ కార్యక్రమానికీ ఆర్ధికం, అన్నివిధాలుగా సహాయ సహకారం అందిస్తామని తెలిపారు.

వి.హ నుమంతరావు మాట్లాడుతూ కాన్సర్కంటే ప్రమాదకరంగా మారిన డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టడానికి ఒక పోలీసు శాఖ శక్తి సరిపోదని, సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈగల్స్ ఫోర్స్ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణామూర్తి గుప్తా, ‘శపథ్‘ నిర్వహణ కమిటీ అధ్యక్షులు రామ్ నివాస్ బన్సల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవేంద్ర శాస్త్రీ, ‘శపథ్‘ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ సునీల్ అగర్వాల్, సలహాదారులు రాజీవ్ అగర్వాల్, విశాల్ కేడియా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనిల్ సింగ్, ప్యాట్రన్లు అనిరుధ్ గుప్తా, నరేంద్ర గోయల్ పాల్గొన్నారు.