ముదిరాజుల హక్కులకు ఉద్యమం మరింత బలోపేతం
ముదిరాజ్ చైతన్య వేదిక అధ్యక్షుడు శివ ముదిరాజ్
పంజాగుట్ట, జూన్ 21 (విజయక్రాంతి): ముదిరాజుల కుల సాధన కోసం ఉద్యమాలను మరింత బలపేతం చేస్తామని ముది రాజ్ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వై శివ ముదిరాజ్ అన్నారు. ఇటీవల ప్రభు త్వం నిర్వహించిన ఆర్థిక, కుల సర్వేపై ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబు ల్ సమావేశాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షుడు డాక్టర్ వై.శివ ముది రాజ్ మాట్లాడుతూ... కార్యక్రమానికి అధ్యక్షత ముదిరాజ్ సమాజానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, సర్వేలో వెల్లడైన అంశాలపై సమా జంలో చైతన్యం కల్పించడం, భవిష్యత్ కా ర్యాచరణకు మార్గదర్శక సూచనలు రూపొందించడం సమావేశం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అనంతరం కంచె ఐలయ్య షెపర్డ్ మాట్లాడుతూ.. తెలంగాణలో నిర్వహించిన కుల గణన సర్వే ద్వారా అణగారిన వర్గాల వాస్తవ సామాజిక, ఆర్థిక పరిస్థితులు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో జనాభాపరంగా అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్ సామాజికవర్గం విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో ఇంకా వెనుక బాటుకు గురవుతోందనే విషయంలో సర్వే లో స్ఫష్టమైందన్నారు. మాజీ ఐఏఎస్ టీ చిరంజీవులు మాట్లాడుతూ.. సామాజిక న్యా య సాధనలో డేటా ఆధారిత విధానాలు కీలకమన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ సింహాద్రి, అల్లాదుర్గం సురేశ్, బ్రహ్మం ముదిరాజ్, గురునాథ్, మధు యాదవ్, అవ్వారు వేణు, చెన్నమనేని శ్రీకాంత్, భాస్కర్, రాము ముదిరాజ్ పాల్గొన్నారు.






